సమాజంలో మహిళ సమానత్వం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మా రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అంగన్వాడీ ఉపాధ్యాయులకు, ఆయాలకు చీరలు అందించారు.
మాతా శిశు సంక్షేమ విభాగంలో మరణాల రేటు తగ్గుతోందని సునీతాలక్ష్మా రెడ్డి తెలిపారు. ఇందుకు కారణం అంగన్వాడీలు అందిస్తున్న సేవలేనని ఆమె పేర్కొన్నారు. అంగన్వాడీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతీ అంగన్వాడీ ఉపాధ్యాయురాలికి చరవాణి అందించి, కార్యక్రమాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణ విషయంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని కోరారు.
ఇదీ చదవండి: రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి