సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో భాగంగా సంకీర్తన యాత్ర నిర్వహించారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం పుర వీధుల నుంచి దుర్గా మాత ఆలయం వరకు ఆటాపాటలతో కోలాటలతో ఈ ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది.
వైభవంగా సాగిన ఈ యాత్రలో..జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ.. కాషాయ జెండాలతో రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తులు పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణానికి తాము ఉడతా భక్తిగా సహాయం చేయటం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ఈ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.