ETV Bharat / state

ఉద్యోగ భద్రత కోసమే ఆర్టీసీ కార్మికుల సమ్మె

తాము చేస్తున్న సమ్మె జీతాల కోసం కాదని.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఉద్యోగ భద్రత కోసమేనని సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు.

ఉద్యోగ భద్రత కోసమే ఆర్టీసీ కార్మికుల సమ్మె
author img

By

Published : Oct 6, 2019, 3:19 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కొత్త బస్టాండు వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూటీఎస్ మద్దతు తెలిపింది. అనంతరం కార్మికులు బస్టాండ్ ఆవరణలో బతుకమ్మ ఆడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. కొంత మంది మహిళా వృద్ధులు స్వచ్ఛందంగా బతుకమ్మ ఆడి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. కార్మికులపై ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుందని.. దీని వల్ల ఆర్టీసీ నష్టాలపాలు అవుతుందని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే.. విచ్చలవిడిగా ధరలు పెరిగే అవకాశం ఉందని... అందుకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని స్పష్టం చేశారు.

ఉద్యోగ భద్రత కోసమే ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఇవీ చూడండి: బౌలర్లు భళా.. తొలి టెస్టులో భారత్​ విజయం

Intro:TG_SRD_57_06_RTC_MOUNA_PRADARSHANA_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె జీతాల కోసం కాదని.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఉద్యోగ భద్రతనే తమ ముఖ్య డిమాండ్లని కార్మికులు స్పష్టం చేశారు. సమ్మె రెండవ రోజులో భాగంగా కార్మికులు సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి ఐబి వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూటీఎస్ మద్దతు తెలిపింది. అనంతరం కార్మికులు బస్టాండ్ ఆవరణలో బతుకమ్మ ఆడి.. తమ నిరసన వ్యక్తం చేయగా.. కొంత మంది మహిళ వృద్ధులు స్వచ్ఛందంగా బతుకమ్మ ఆడి మద్దతు తెలిపారు. కార్మికులపై ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుందని.. దీని వల్ల ఆర్టీసీ నష్టాలపాలు అవుతుందని తెలిపారు. ఆర్టీసీ ని ప్రైవేటీకరణ చేస్తే.. విచ్చలవిడిగా ధరలు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Body:బైట్: క్రిష్ణ రెడ్డి, సంగారెడ్డి డిపో కార్యదర్శి
బైట్: ఉపేందర్, ఆర్టీసీ ఉద్యోగి
బైట్: సాబేర్, ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.