ORGANS DONATION: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమారుడు బ్రెయిన్ డెడ్ అవ్వడంతో తల్లిదండ్రులు అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. మరో మూడు కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. అవయవదానంతో ఆ దంపతులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ యాదయ్య తన మంచి మనసును చాటుకున్నారు.
ఈనెల 14న యాదయ్య కుమారుడు ప్రవీణ్ వెళుతున్న ద్విచక్రవాహనాన్ని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రవీణ్‌కు తీవ్రగాయాలు కావడంతో నానక్‌రాం గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు. రెండురోజులు చికిత్స అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ ప్రతినిధులు ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిసి అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు అంగీకరించారు. అతని రెండు కిడ్నీలు, లివర్ ముగ్గురికి దానం చేశారు. అవయవ దానం చేసి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన యాదయ్య దంపతులను జీవన్‌దాన్ సంస్థ సభ్యులు సత్కరించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఇవీ చూడండి:Heavy Rain: పలు జిల్లాల్లో అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్... మరో రెండు నోటిఫికేషన్లు వచ్చేశాయ్
'పద్మశ్రీ'కి అవమానం.. నడిరోడ్డుపైకి 90 ఏళ్ల కళాకారుడు
తొమ్మిది మంది భార్యల ముద్దుల మొగుడు- ఆ పని కోసం 'టైమ్ టేబుల్'