కరోనా సోకి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిపై అపోలో వైద్యులతో మాట్లాడుతున్నారన్నారు. తనకు అత్యత్తమ చికిత్స అందుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీచూడండి: ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడానికి ప్లాస్మానే ఆయుధం : చిరంజీవి