ETV Bharat / state

ట్వీట్​కు స్పందించిన కేటీఆర్.. చిన్నారికి వైద్యం

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలికను ఆదుకోవాలని ఎండీఆర్​ ఫౌండేషన్​ ట్విట్టర్​లో చేసిన అభ్యర్థన మేరకు మంత్రి కేటీఆర్​ స్పందించారు. ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని సంగారెడ్డి జిల్లా పాలనాధికారికి మంత్రి సూచించారు. డీఎంహెచ్​వో దృష్టికి తీసుకెళ్లి వైద్యం అందేలా చూస్తామని కలెక్టర్​ హనుమంతరావు బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

ktr response to tweet
ట్వీట్​కు స్పందించిన కేటీఆర్​... చిన్నారికి వైద్యం
author img

By

Published : Apr 30, 2020, 10:59 PM IST

లాక్​డౌన్ సమయంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలికకు సహాయం చేసి ఆదుకోవాలని ఎండీఆర్ ఫౌండేషన్ ట్విట్టర్​లో అభ్యర్థన చేసిన మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అంబేడ్కర్ ‌కాలనీకి చెందిన వైష్ణవి అనే ఐదోతరగతి చదువుతున్నబాలిక చిన్న నాటి నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ప్రతి 20 రోజులకు ఒకసారి ఆ బాలికకు తండ్రి రక్తమార్పిడి చేయించేవారు. లాక్​డౌన్ వల్ల తండ్రి పెంటేష్​కు పెయింటర్ పని దొరక్క ఇబ్బందులు ఎదురవడం వల్ల బాలికను తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తెలుసుకున్న ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు దేవేందర్​ రాజు ఆమె తల్లి సంగీతకు రూ.2 వేలు ఆర్థిక సహాయం అందించి బాలిక బంధువు అయిన నర్సింగ్ చేత మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్​లో అభ్యర్ధన పెట్టించారు.

దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా పాలనాధికారి హనుమంతరావుకు సూచించారు. దీనితో ఆయన స్థానిక తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, గిర్దవార్​ రాజును పంపించి వారి పరిస్థితిని విచారించి తెలుసుకున్నారు. డీఎంహెచ్​వో దృష్టికి తీసుకెళ్లి సంగారెడ్డిలో వైద్యం అందేలా చూస్తానని పాలనాధికారి స్థానిక అధికారుల ద్వారా వారికి తెలిపారు. బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్​లో ఆరాంఘడ్ ఆసుపత్రిలో తమ కూతురిని చూపిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సంగారెడ్డి వెళ్లి రక్తమార్పిడి చేయించుకున్నా... మళ్లీ మందులకు, వైద్యం కోసం రాజేంద్రనగర్‌కు వెళ్లాల్సి వస్తోందని అందువల్లే అక్కడికే వెళ్లేందుకు వారు సుముఖత చూపారు. ఆ నివేదికను జిల్లా పాలనాధికారికి పంపనున్నట్లు తహశీల్దార్ తెలిపారు. అలాగే వారికి 10 కిలోల బియ్యం, నిత్యవసరాలు అందించారు. బాలిక వెళ్లేందుకు ప్రతిసారి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమలు యథావిధిగా నడవాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.