సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. రంజోల్, అల్లీపూర్ ప్రాంతాల్లో పర్యటించారు. అంతర్గత దారులు, మురుగు కాలువల నిర్మాణం, చెత్త చెదారం, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.
వార్డుల రూపురేఖలు మార్చుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని స్థానికులను కోరారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వార్డు సభ నిర్వహించి స్థానికుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు.
ఇవీ చూడండి: వీరు భర్తలు కాదు.. రాక్షసులు..