ETV Bharat / state

GANESH IDOL: పొలం దున్నుతుండగా బయటపడిన విగ్రహం - సంగారెడ్డి జిల్లా వార్తలు

పంట సాగు చేద్దామని ట్రాక్టర్​తో​ పొలం దున్నుతున్నారు. ఒక చోట ట్రాక్టర్​ నాగలికి ఏదో తట్టినట్లు అనిపించింది. రాయి కావొచ్చు అనుకుని డ్రైవర్​ కిందికి దూకి చూశాడు. అంతే నాగలికి తట్టుకుంది రాయి కాదు విగ్రహమని అర్థమైంది. ఇంతకి ఏ విగ్రహం వారికి కనిపించింది.

idol of Ganesha
గణపతి విగ్రహం
author img

By

Published : Aug 1, 2021, 7:18 AM IST

పొలం దున్నుతుండగా భారీ గణపతి విగ్రహంతో పాటు పీఠం బయటపడ్డాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం తుర్కపల్లికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్​కు గ్రామ శివారులో కొంత భూమి ఉంది. తనకున్న పొలంలో కొన్నేళ్లుగా వర్షాధార పంటలైన పత్తి, కంది, మినుము, పెసర వంటివి సాగుచేస్తున్నారు. ఈసారి వర్షాలు బాగా కురవడం, నీరు అందుబాటులో ఉండటంతో మాగాణి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అచ్చుకట్టలు కట్టేందుకు శనివారం సాయంత్రం పొలంలో దున్నిస్తుండగా ట్రాక్టరు నాగలికి తగిలి విగ్రహం, పీఠం బయటపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వినాయక విగ్రహం చూసేందుకు తరలొస్తున్నారు.

ఈ విషయమై అధికారులకు ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. పురావాస్తు శాఖ వారు అక్కడి చేరుకుని విగ్రహాన్ని పరిశీలిస్తే ఏ కాలానికి చెందినదో చెప్పగలుగుతారని స్థానికులు చెబుతున్నారు. పుర్వం ఇక్కడ గుడి ఉందా.. లేక విగ్రహం మాత్రమే ప్రతిష్టించారా అనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: Lal Darwaza Bonalu: నేడే లాల్‌దర్వాజా బోనాలు.. ఉత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.