హనుమాన్ జయంతి వేడుకలు సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. హనుమంతుని విగ్రహాన్ని ఊరేగించారు. వీహెచ్పి, భజరంగ్ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న భవానీ మాత ఆలయం నుంచి ద్విచక్ర వాహన ర్యాలీగా వెళ్లారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని "జై హనుమాన్.. జై జై హనుమాన్" అంటూ ముందుకు సాగారు.
ఇవీ చూడండి: హనుమాన్ పూజల్లో మంత్రి తలసాని శ్రీనివాస్