ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి - గుర్తుతెలియని వాహనం ఢీకొని సంగారెడ్డిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా... మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

engeneering student died in accident at rudraram
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
author img

By

Published : Dec 4, 2019, 3:53 PM IST

సంగారెడ్డి జిల్లా సుల్తాన్​పూర్ సమీపంలోని జెఎన్టీయూలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు రాజ్ కుమార్, ఈశ్వర్ ద్విచక్రవాహనంపై పటాన్​చెరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో రుద్రారం సమీపంలో గుర్తు తెలియని వాహనం వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజ్ కూమార్ అక్కడికక్కడే మృతి చెందగా... ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గమనించిన స్థానికులు ఈశ్వర్​ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి బీరంగూడలోని పనేషియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

ఇవీ చూడండి: ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

Intro:hyd_tg_21_04_rudram_accident_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ సమీపంలో జె.ఎన్.టి.యులో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు బుల్లెట్ వాహనంపై పటాన్చెరు వైపు వస్తున్నారు అదే సమయంలో రుద్రారం సమీపంలో గుర్తుతెలియని వాహనం వారి బుల్లెట్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజకుమార్ అక్కడికక్కడే మృతిచెందగా ఈశ్వర్ కు తీవ్ర గాయాలయ్యాయి మరో విద్యార్థి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి క్షతగాత్రులను తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం బీరంగూడ లో పనేషియా ఆస్పత్రికి తరలించారుConclusion:పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.