తడి, పొడి చెత్తను వేరు చేయాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలిక కమిషనర్ సుభాశ్ రావు సూచించారు. పట్టణ ప్రజలు రెండు రకాల చెత్త బుట్టలు వాడాలని స్వచ్ఛ నమస్కారం ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని శాంతినగర్ హౌసింగ్ బోర్డు, వెంకటరమణ కాలనీ పరిధిలో సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రతి ఇంట్లో ఆకుపచ్చ, నీలం రంగు చెత్త బుట్టలు ఉపయోగించి తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించాలని సూచించారు. చెత్తతో మహిళలు చేపడుతున్న సేంద్రియ ఎరువుల తయారీ తీరును పరిశీలించి మున్సిపల్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు.