చట్టాలను గౌరవించని ముఖ్యమంత్రిని మనమెందుకు గౌరవించాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులకు వామపక్షాల తరఫున ఆయన మద్దతు తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. వారికి తాము అండగా ఉంటామన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె.. రాబోయే కాలంలో సకల జనులసమ్మె గా మారుతుందని.. ఆ ఉద్యమాన్ని తట్టుకోలేక ముఖ్యమంత్రి కేసీఆరే సెల్ఫ్ డిస్మిస్ అవుతారని జోస్యం చెప్పారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ పక్క రాష్ట్రంలో సాధ్యమైనప్పుడు.. మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని.. రాయితీలు కల్పించక పోవడం వల్లే నష్టాల్లోకి వెళ్లిందన్నారు.
ఇవీ చూడండి: అద్దె బస్సుల టెండర్లపై హైకోర్టులో పిటిషన్