ETV Bharat / state

CM KCR Sangareddy Tour Today : నేడు ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయం ప్రారంభోత్సవం

CM KCR Visits Sangareddy Today : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఇవాళ మహోత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఒకే ప్రాంగణంలో 15 వేల 660 ఇళ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సహా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమిపూజ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

CM KCR Sangareddy Tour Today
CM KCR Sangareddy Tour Today
author img

By

Published : Jun 22, 2023, 7:04 AM IST

Updated : Jun 22, 2023, 7:21 AM IST

నేడు ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయం ప్రారంభోత్సవం

CM KCR Inaugurates Kollur Double Bedroom Houses Today : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొదట కొల్లూర్‌లో ప్రభుత్వం నిర్మించిన భారీ రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఆరుగురు లబ్ధిదారులతో సీఎం కేసీఆర్ స్వయంగా గృహ ప్రవేశం చేయించనున్నారు. సీఎం గృహప్రవేశం చేయించే లబ్ధిదారుల విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజవర్గాలను ఇద్దరి చొప్పున ఎంపిక చేశారు. వీరిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుడుతో పాటు ఒకరు సాధారణ కేటగిరికి చెందిన వారు ఉన్నారు.

CM KCR Inaugurates Kollur Double Bedroom House Project : కొల్లూరులో కేసీఆర్ ప్రారంభించే గృహ సముదాయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 145 ఎకరాల విస్తీర్ణంలో రూ.1450 కోట్లు ఖర్చు చేసి 15 వేల 660 ఇళ్లను నిర్మించారు. 117 బ్లాకులుగా నిర్మించిన గృహ సముదాయంలో.. ఒక్కో బ్లాకులో 8 నుంచి 11 అంతస్థుల వరకు ఉన్నాయి. ప్రతి ప్లాట్‌కు గాలి వెలుతురు ధారళంగా వచ్చేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి బ్లాక్‌కు రెండు లిఫ్టులు, రెండు లేదా మూడు మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. మొత్తం విస్తీర్ణంలో కేవలం 14 శాతమే భవనాల నిర్మాణానికి వినియోగించారు. 23 శాతం రోడ్లు, డ్రైనేజీల కోసం.. 25 శాతం పార్కులు, ఆట స్థలాల కోసం వినియోగించారు. 38 శాతం భూమిని భవిష్యత్ సామాజిక అవసరాల కోసం కేటాయించారు.

CM to Inaugurates Double Bedroom Houses At Kollur : పదమూడున్నర కిలోమీటర్ల పోడవైన అంతర్గత రోడ్లను నిర్మించారు. 10.6 కిలోమీటర్ల పోడవైన భూగర్భ డ్రైనేజీ పైపులైను ఇప్పటికే వేశారు. 15 వేల 660 కుటుంబాలు ఒకే ప్రాంగణంలో నివాసం ఉండటంతో పెద్దఎత్తున నీటి వసతి అవసరం అవుతుంది. ఇందుకోసం 21 వేల కిలో లీటర్ల సామర్థ్యంతో మంచినీటి ట్యాంకులు నిర్మించారు. 3దుకాణ సముదాయాలు, బ్యాంకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం వంటి వాటిని సైతం ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రెండు పడక గదుల నిర్మాణ ప్రాంగణంలో 30 వేల మొక్కలు నాటారు. మురుగు నీటిని శుద్ధి చేసి.. మొక్కలు, ఇతర అవసరాల వినియోగించుకునేలా 9 మిలియన్ల లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు సొంత చేసుకున్న ఈ భారీ గృహ సముదాయానికి కేసీఆర్ నగర్‌గా నామకరణం చేశారు.

CM KCR To Inaugurate Kolluru Double Bedroom Houses : రెండు పడక గదుల గృహ సముదాయం అనంతరం వెలిమల శివారులోని మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత పటాన్‌చెరుకు చేరుకుని.. రూ.183 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం 25 శాతం నిధులు ఇస్తుండగా.. మిగిలిన వ్యయాన్ని కాలుష్య నియంత్రణ మండలి భరించనుంది. చివరగా బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారి నియోజకవర్గానికి వస్తుండటంతో.. తమపై వరాలు కురిపిస్తారని పటాన్‌చెరు నాయకులు, ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 22, 2023, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.