పంచాయతీ అనుమతి ఉన్న ప్లాట్లను తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలంటూ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీరంగూడ కూడలి నుంచి బీహెచ్ఈఎల్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు.
నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని... తమ వద్ద పని చేసే భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నామని వాపోయారు. ఇలాగే కొనసాగితే బిల్డర్లకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.