ETV Bharat / state

Bore Water Without Current in Sangareddy : ఆ ఊరిలో కరెంట్​ లేకుండానే బోర్ల నుంచి నీరు.. కాలం మారితే సీన్​ రివర్స్​ - సంగారెడ్డి తాాజా వార్తలు

Bore Water Without Current in Sangareddy : బోరు నీళ్లు రావాలంటే కరెంటు తప్పనిసరి. ఒక్కోసారి కరెంటు ఉన్నా.. భూగర్భ జలాలు లేకపోవడం వల్ల నీరు రావు. కానీ ఈ ఊర్లో మాత్రం కరెంటు అవసరం లేకుండానే బోర్ల నుంచి పొలాలకు సరిపడా నీరు అందుతుంది. అది ఎలా అంటే..?

Borewater
Borewater
author img

By

Published : Aug 6, 2023, 10:59 AM IST

Sanga Reddy Bore Water : కరెంటు లేకుండా బోరు నీళ్లు రావడం చూశారా...?

Sangareddy Bore Water Without Current : సాధారణంగా బోరుబావి నుంచి నీళ్లు రావాలంటే స్టాటర్‌ బాక్సు మీట నొక్కాలి! అదే.. చేతి పంపు అయితే పైకీ కిందకు ఆడించాలి. కానీ.. ఆ గ్రామంలో విద్యుత్‌ మీటర్‌ నొక్కాల్సిన పని లేదు! చేతిపంపులను పైకి కిందకు ఆడించాల్సిన అవసరం అంత కన్నా లేదు. భారీ వర్షాలు కురిస్తే చాలు.. పాతాళ గంగ పైపైకి ఉబికి వస్తుంది. పని చేయని బోర్ల నుంచీ నీరు ఎగజిమ్ముతూ గ్రామస్థులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పెరుగుతున్న కాలుష్యం కారణంగా భూమిపై ఉష్ణోగ్రత పెరిగి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో బోర్లు తవ్వించినా ప్రయోజనం లేకుండాపోతోంది. పెరుగుతున్న జనాభా వల్ల చెరువు, కాల్వలు పూడ్చి భవనాలు కట్టడం కూడా భూగర్భ జలాలు తగ్గడానికి ఒక కారణం. అందువల్ల బోర్లు తవ్వించినా నీళ్లు రావడం లేదు. వర్షాలు సమృద్ధిగా పడి, చెరువులు, కుంటలు తవ్విస్తే తప్పా వాటి భూగర్భ జలాల శాతాన్ని పెండానికి వీలుండదు. అప్పుడే ప్రజలకు నీరు సమృద్ధిగా అందుతాయి. ఎప్పడి నుంచో ఉన్న చేతి పంపుల్లో కూడా నీరు రానిరోజులు ఉన్నాయి. ఈ గ్రామంలో మాత్రం వర్షకాలం వచ్చిందంటే చాలు పని చేయని బోర్లు, చేతి పంపులు అన్నీ పని చేస్తాయి. వాటికి కరెంటు అందించినా, అందించకపోయినా నీళ్లు పొంగుతాయి.

Bore Flows without motor: ఆరేళ్లుగా ఆగని జలధార.. మోటారు లేకుండానే పొంగుతున్న గంగమ్మ

సంగారెడ్డి జిల్లా ఝురాసంగం మండలం గినియార్​పల్లి గ్రామంలో వర్షాకాల సమయంలోనైతే మోటార్లు వేయకపోయినా బోరు బావుల్లో నుంచి భూగర్భజలం పొంగుతూ బయటికి వస్తుంది. ఇలా దాదాపుగా రెండు నెలల పాటు ఊరు మొత్తం ఎటువంటి నీటి కొరత లేకుండా పంట పొలాలకు సరిపోతూ.. గ్రామస్థులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా నీళ్లు లభిస్తాయి. ఊరూవాడా మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుంది.

" వర్షకాలం తప్ప మిగిలిన కాలాల్లో నీళ్లు రావు. ఎండకాలంలో అయితే మొత్తం కరువే. ప్రభుత్వం వేసిన నల్లా నీళ్లు వస్తాయి. వర్షాకాలంలో మాత్రం ఈ బోరు పొంగుతది. వర్షాకాలం పోగానే మళ్లీ నీటి కొరత మొదలవుతుంది." - స్థానికులు

అలాగే ఎండాకాలంలోనైతే బోర్ బావులు మొత్తం ఇంకిపోయి, తాగడానికి సైతం ఒక చుక్క నీరు కూడా అందులో నుంచి రావు. నీళ్ల కోసం గ్రామస్థులు పొలాల బాట పట్టి ఎంతో దూరం నడిచి ప్రయాసపడి నీళ్లు తెచ్చుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా వాటర్ ట్యాంకులతో ఈ గ్రామానికి ఆ కొద్ది రోజులు నీటిని సప్లై చేస్తారు. వేసవిలో నీటి సదుపాయం సరిగా లేక, వ్యవసాయానికి కూడా నీళ్లు సరిపోక పశువులు సైతం తాగడానికి చుక్క నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఉంటాయని గ్రామస్థులు చెబుతున్నారు.

Fire breaks out from borewell: కోనసీమ పంట పొలాల్లో గ్యాస్ లీక్ మంటలు.. అదుపు చేసిన అధికారులు

బోరుబావి నుంచి బయటకు వస్తున్న బంగారం.. ఎగబడుతున్న జనం!

బోరుబావి నుంచి బాలుడు బయటకు.. NDRF ఆపరేషన్​ సక్సెస్..​ హుటాహుటిన ఆస్పత్రికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.