సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండలం జమిగి (బి) పాఠశాలలో ప్రతి ఏటా ఆగస్టు 8న మొక్కలు నాటుతారు. ఈ ఏడాది నాటిన మొక్కలకు..వచ్చే ఏడాది పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఆరేళ్లుగా బర్త్డే జరుపుతున్నారు. మొక్కల వయస్సు తెలియజేస్తూ ప్లకార్డులు పెట్టి మరీ శుభాకాంక్షలు తెలుపుతారు.
ఈసారి కూడా మొక్కల పుట్టినరోజును సంబురంలా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు స్థానికులు కూడా హాజరయ్యారు. మిఠాయిలు పంచిపెట్టారు.
ఆరేళ్లుగా ఇలా వేడుకలు చేయటం ఇక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులకు అలవాటైంది. ఎక్కడా లేని విధంగా... మొక్కలకు పుట్టిన రోజు వేడుకలు చేయడం ప్రత్యేకతగా ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: సాహిత్యంలో వీళ్లు పిల్లలు కాదు పిడుగులు