ETV Bharat / state

ఆకాశంలో అద్భుతం 'హలో'.. ఈ ఏడాది ఏం జరగనుంది?

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలో సుందర దృశ్యం ఆవిష్కృతం అయింది. సూర్యుని చుట్టూ ఇంద్ర ధనస్సు మాదిరిగా వలయం ఏర్పడింది. దీన్ని హలో (HALO) అంటారని చెబుతున్నారు. ఇలా ఏర్పడితే ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతుల విశ్వసిస్తుంటారు.

author img

By

Published : Jun 2, 2021, 2:00 PM IST

Updated : Jun 2, 2021, 2:05 PM IST

HALO FORMED IN SKY
HALO: ఆకాశంలో అద్భుతం 'హలో'..

ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఇంద్ర ధనస్సు మాదిరి సూర్యుని చుట్టూ వలయం ఏర్పడింది. ఉదయం పది గంటల నుంచి ఇది కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురైన ప్రజలు... తమ సెల్‌ఫోన్లలో బంధించారు.

సాంకేతికంగా దీనిని 'హలో' అంటారని నిపుణులు చెబుతున్నారు. దట్టమైన మేఘాలు ఏర్పడి.. వాటిలో ఘనీభవించిన నీటి బిందువులపై సూర్యకిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతం అవుతుందన్నారు. మంచు బిందువులపై పడిన కిరణాలు పరావర్తనం చెంది ఇలా ఇంద్ర ధనస్సు రంగుల్లో కనిపిస్తాయని తెలిపారు. సాధారణ పరిభాషలో దీనిని వరద గూడు అని అంటారన్నారు. ఇలా ఏర్పడితే ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతుల విశ్వసిస్తుంటారు.

ఆకాశంలో అద్భుతం 'హలో'.. ఈ ఏడాది ఏం జరగనుంది?

ఇవీచూడండి: Live Video: గంగా నదిలో మునిగిన భారీ క్రేన్​!

Last Updated : Jun 2, 2021, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.