ETV Bharat / state

అమీన్​పూర్ మున్సిపాలిటీ బడ్జెట్ రూ.50 కోట్లు

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీలో అడిషనల్ పాలనాధికారి రాజర్షి షా, మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్లు వార్షిక బడ్జెట్ రూ.50.49 కోట్లుగా అంచనా వేశారు.

ameenpur municipality  Annual budget 50 Crores
అమీన్పూర్ మున్సిపాలిటీ బడ్జెట్ 50 కోట్లు
author img

By

Published : Mar 17, 2020, 5:44 AM IST

Updated : Mar 17, 2020, 6:33 AM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ పురపాలికలో అడిషనల్ పాలనాధికారి రాజర్షి షా బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలో మిగులు బడ్జెట్ రూ.13.7 కోట్లని ఆయన తెలిపారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కోసం రూ.8.19కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో పార్కులు, వైకుంఠ ధామాల అభివృద్ధి, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, సమీకృత సంతల అభివృద్ధి, జంతువుల శాల నిర్మాణం, శాస్త్రీయ పద్ధతిలో డంపింగ్ యార్డ్​ నిర్వహణకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

వార్డులో వివిధ అభివృద్ధి పనులకు రూ.10.20 కోట్లు కేటాయిస్తున్నట్లు అలాగే రూ.88.85 లక్షలు ఇతర మూలధన వ్యయాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. బడ్జెట్​లో 10 శాతం హరితహారం కోసం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.

అమీన్పూర్ మున్సిపాలిటీ బడ్జెట్ 50 కోట్లు

ఇదీ చూడండి: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

Last Updated : Mar 17, 2020, 6:33 AM IST

For All Latest Updates

TAGGED:

budjet
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.