ETV Bharat / state

ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు - భక్తులతో కిటకిటలాడిన వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబద్​లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

vaikunta ekadashi
ఉదయం 2 గంటల నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు
author img

By

Published : Jan 6, 2020, 11:13 AM IST

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హైదరాబాద్​లోని అన్ని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఉదయం రెండు గంటల నుంచే స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఎక్కడికక్కడ క్యూ లైన్​లను ఏర్పాటు చేసి... త్వరగా దర్శనం పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ఉచిత లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకదాశి పర్వదినాన స్వామివారిని దర్శించుకుని భక్తిలు పారవశ్యం పొందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఉదయం 2 గంటల నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి: శ్రీవారి సన్నిధిలో 'మన' మంత్రులు...

Intro:జియాగూడ రంగనాథ స్వామి ఆలయంBody:జియాగూడ రంగనాథ స్వామి ఆలయంConclusion:హైదరాబాద్: () జియాగూడ లోని ప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2 am నుండి భక్తులు స్వామివారిని దర్శించేందుకు బారులు తీరారు...
సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా తిరుమల తిరుపతికి వెళ్ళలేని పేద మరియు వృద్ధుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మాత్రం తీసిపోకుండా అన్ని హంగులతో రూపుదిద్దుకుంది, సుమారు నెలల పాటు శ్రమించి ఈ దేవాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.