రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులకు తెరాస 16 సీట్లు, కాంగ్రెస్ 8 స్థానాలలో గెలుపొందింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వేషన్ కావడం వల్ల ఛైర్మన్ పదవికి తక్కువ పోటీ నెలకొంది. ఛైర్మన్గా కప్పరి స్రవంతి ఎన్నికకాగా.. వైస్ ఛైర్మన్గా ఆకుల యాదగిరిని ఎన్నుకున్నారు.
ఇవీ చూడండి: సూర్యాపేట 5 మున్సిపాలిటీల్లో 'గులాబీ' ఛైర్మన్లు