ETV Bharat / state

Rats Biting Students: గురుకుల పాఠశాలలో ఎలుకల కలకలం.. విద్యార్థులను కరిచిన మూషికాలు - Rats biting

Rats biting students at Daulatabad Gurukul school, rangareddy district
గురుకుల పాఠశాలలో ఎలుకల కలకలం
author img

By

Published : Dec 6, 2021, 3:42 PM IST

Updated : Dec 6, 2021, 5:35 PM IST

15:36 December 06

Rats Biting Students: గురుకుల పాఠశాలలో ఎలుకల కలకలం

గురుకుల పాఠశాలలో ఎలుకల కలకలం

Rats Biting Students: రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర విద్యాలయంలో ఎలుకలు కలకలం రేపాయి. హాస్టల్​లో నిద్రిస్తున్న తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. విద్యార్థులను షాద్​నగర్​ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి వైద్యం అందించారు.

గురుకుల పాఠశాలలో 850 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడి టీచర్లు మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు తెచ్చి ఇచ్చిన స్నాక్స్​ వల్లే ఎలుకలు వచ్చి ఉంటాయని అంటున్నారు. తొమ్మిది మంది విద్యార్థులకు ఎలుకలు కరవడంతో మిగతా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

తల్లిదండ్రులు తెచ్చిన తినుబండారాల వల్లే...

ఆదివారం సెలవు కావడంతో.. తమ పిల్లలను చూడడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి కోసం.. తినుబండారాలను తీసుకువచ్చినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ తినుబండారాలను విద్యార్థులు మూడో అంతస్తులో నిద్రించే గదిలోని ఓ బ్యాగులో పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా ఆదివారం రాత్రి తమ గదుల్లో విద్యార్థులు పడుకున్నారు. దీనితో తినుబండారాల కోసం వచ్చిన ఎలుకలు.. వారిని కొరికాయి. విద్యార్థులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాఠశాలలో 9 మంది విద్యార్థుల్లో ఇద్దరిని కొరకగా.. మిగిలిన వారిని గీకాయని విద్యార్థులు చెబుతున్నారు.

మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు

ఈ విషయాన్ని సోమవారం ఉదయం విద్యార్థులంతా అధ్యాపకులకు తెలపగా.. అక్కడే ఉన్న ఆరోగ్య సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. ఆరోగ్య సిబ్బంది.. విద్యార్థులకు ప్రథమ చికిత్స చేసి.. షాద్​నగర్​ ఆసుపత్రికి తరలించారు. వారికి టీటీ ఇంజక్షన్​ ఇప్పించారు. విద్యార్థులకు సరైన వైద్యం అందించామని ఎలాంటి ఇబ్బంది లేదని ఆరోగ్య సిబ్బంది, అధ్యాపకులు తెలిపారు‌. పాఠశాలలో 850 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని ప్రిన్సిపల్ సుభాన్ తెలిపారు. తినుబండారాల మూలంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటామని అధ్యాపకులు తెలిపారు.

తల్లిదండ్రులు తీసుకువచ్చిన తినుబండారాల వల్లే ఎలుకలు వచ్చాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. అందరికి చికిత్స అందించాం. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటాం.

- సుభాన్, ప్రిన్సిపాల్​

సంబంధిత కథనాలు

తొలుత ఎలుకల్లో ఒమిక్రాన్‌

Omicron evolved in rats: దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్.. తొలుత ఎలుకల్లో వృద్ధి చెంది ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించడానికి ఉపయోగపడే ఏడు ఉత్పరివర్తనాలు ఒమిక్రాన్‌లో ఉన్నాయని చెబుతున్నారు. వైరస్‌ అనేక ఉత్పరివర్తనాలకు లోనై తిరిగి మానవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని వివరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి!

"చందమామ కథలు" సినిమా చూశారా.. ఆ చిత్రంలో బిక్షాటన చేస్తూ బతికే ఓ వృద్ధుడు తన ఇంటి కోసం తిండీతిప్పలు మానేసి.. డబ్బు కూడబెట్టుకుంటాడు. అందరిలాగే.. తాను కూడా గొప్పగా బతకాలని బిక్షాటన చేసి సంపాదించిన డబ్బంతా.. ఎవరికీ తెలియకుండా.. ఓ ప్రాంతంలో దాచుకుంటాడు. కష్టపడి సంపాదించిన డబ్బు.. కలలు గన్న ఇల్లు.. ఆ కల తీరకుండానే ప్రాణాలు కోల్పోతాడు. దాదాపు ఇలాంటి కథే మహబూబాబాద్ జిల్లాలోని ఇందిరానగర్ తండాకు చెందిన ఓ వృద్ధుడిది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కూడబెట్టిన డబ్బును ఎలుకలు కొట్టేశాయి!

కట్టుకున్న వాడు కాలం చేయడంతో ఏళ్ల తరబడి ఒంటరిగా జీవిస్తోంది ఆ వృద్ధురాలు. ఎవరిపై ఆధారపడకుండా.. ఎవరి ముందు చేయి చాచకుండా కష్టపడి కూలీ చేసుకుంటూ బతుకీడుస్తోంది. అలా కూలీ చేసుకుని రూ.5వేల వరకు నగదు పోగు చేసింది. ఆ డబ్బంతా బీరువాలో భద్రంగా దాచుకుంది. అవసరం పడి ఓ రోజు.. ఆ డబ్బు తీసుకుందామని బీరువా తెరవగా.. రూ.5వేల విలువ గల నోట్లన్ని చిరిగిపోయాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పడ్డ కష్టమంతా.. ఎలుకలు.. బూడిదలో పోసిన పన్నీరు చేశాయని ఆ మహిళ వాపోయింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Dec 6, 2021, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.