Telangana timber Depot federation bandh: విధి నిర్వహణలో హత్యకు గురైన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.రమణయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టింబర్ ఫెడరేషన్ సభ్యులు పాల్గొని ఫారెస్ట్ ఆఫీసర్ హత్యకు నిరసన తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఒక రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టింబర్ డిపోల బంద్‌కు పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్‌లో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.
టింబర్ డిపోలు.. ఫారెస్ట్ అధికారుల సూచనల మేరకు నడుచుకునేవని తెలంగాణ టింబర్స్ డిపోల అధ్యక్షుడు రమణయ్య అన్నారు. శ్రీనివాసరావు గొత్తికోయల దాడిలో మృతి చెందడం బాధాకరం అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మనసుతో ఆయన కుటుంబానికి 50లక్షల ఎక్స్గ్రేషియా.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. పోలీసుల మాదిరిగానే అటవీశాఖ అధికారులకు కూడా ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చాలని కోరారు.
ఎఫ్‌ఆర్వో చలమల శ్రీనివాసరావు మృతికి సంతాపంగా తెలంగాణ టింబర్ డిపో ఫెడరేషన్, రంగారెడ్డి టింబర్ ఫెడరేషన్ తరపున ఈరోజు బంద్ పాటిస్తూ నివాళులు అర్పిస్తున్నాము. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయుధాలను ఫారెస్ట్ అధికారులకు ఇవ్వాలి. సీఎం కేసీఆర్ ఎఫ్‌ఆర్వో కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించినందుకు టింబర్ ఫెడరేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. - రమణయ్య, తెలంగాణ రాష్ట్ర టింబర్ డిపో ఫెడరేషన్ అధ్యక్షుడు
ఇవీ చదవండి: