ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కుస్మాత్పూర్లోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు. కరోనా వేళ పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వేలాది మంది మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా రూ.ఐదు లక్షల వరకు బీమా లభిస్తుందని తెలిపారు. ఇది పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ మారణహోమం- ఒక్కరోజే 4,529మంది మృతి