Meditation and Music Celebrations at Kanha Shanti Vanam: శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు, అందరూ అభిమానంగా 'లాలాజీ' అని పిలిచే రామచంద్రజీ మహారాజ్ 150వ జయంతిని పురస్కరించుకుని కన్హా శాంతివనంలో వైభవంగా జరిగిన సంగీత, ధ్యాన ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని ఈ శాంతివనంలో జరిగిన సంగీత వేడుకలు శ్రోతలను తన్మయత్వానికి గురిచేశాయి.
శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు లాలాజీ మహారాజ్ 150వ జయంతిని పురస్కరించుకుని శ్రీరామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత పండుగ విజయవంతంగా ముగిసింది. ప్రశాంత, ఉత్సాహభరితమైన వాతావరణం నడుమ జనవరి 25వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్యాన, సంగీత ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ప్రఖ్యాత సంగీత విధ్వాంసురాలు కౌశికి చక్రవర్తి గాన కచేరితో మొదలై దిగ్గజ కళాకారుల ప్రదర్శనలు అత్యద్భుతంగా సాగాయి.
చివరి రోజు శుక్రవారం ప్రఖ్యాత కర్ణాటక సంగీత విధ్వాంసురాలు సుధా రఘునాథన్ కచేరితో ఈ ధ్యాన, సంగీత వేడుకలు విజయవంతంగా ముగిశాయి. తన గానామృతంతో వీక్షకులను తన్మయత్వంలో ముంచెత్తారు. మాధవ మురళి... హరే ముకుందా... గోకులవాస... గోపాల కృష్ణా..., శంభో శివ... శంభో శంభో... స్వయంభు, స్వయంభు అంటూ ఆలపించిన గానం ఆసాంతం అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్ర మిషన్ ఛైర్మన్ కమలేశ్ డీ పటేల్- దాజీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ధ్యాన అభ్యాసీలతో దాజీ సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం సంగీత విధ్వాంసురాలు సుధా రఘునాథన్‌ను కమలేశ్ డీ పటేల్ ఘనంగా సత్కరించారు.
నిజమైన భక్తులుగా మారెందుకు ఆ ప్రక్రియలు దోహదపడతాయి : ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, గురువుల మార్గదర్శకాలు పాటిస్తే శిష్యులుగా రాణించవచ్చని దాజీ అన్నారు. భారతీయ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు దృష్ట్యా రుషులు ఆచరించి అవలంభించిన గొప్ప ధ్యానం, యోగా సాధన చేయడం ద్వారా మానసిక ఉల్లాసంతోపాటు ఆశకామే హద్దుగా విజ్ఞానం, మంచి భక్తిభావం పెరుగుతాయని కమలేశ్ డీ పటేల్ తెలిపారు. శాంతి, సహనం, ప్రేమ, వాత్సాల్యం, చక్కటి ఆధ్యాత్మిక చింతన, నిగ్రహం, సౌభ్రాతృత్వం వంటి బహుళ ప్రయోజనాలు సహా నిజమైన భక్తులుగా మారెందుకు ఆ ప్రక్రియలు దోహదపడతాయని చెప్పారు. వృత్తి, వ్యాకపాల్లో మరింత రాణించవచ్చని దాజీ చెప్పుకొచ్చారు. ఆల్ఫా బీటకల్స్, సంగీతం, వంట చేయడం తరహాలో సాధన చేస్తే తప్ప నైపుణ్యాలు పెరగవని... ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ధ్యానం, యోగా అవలవరుచుకుని సాధన చేసినట్లైతె అద్భుత ప్రయోజనాలు పొందవచ్చని దాజీ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: