ETV Bharat / state

కాటేదాన్​ ప్లాస్టిక్​ పరిశ్రమలో అగ్నిప్రమాదం - కాటేదాన్​ ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం

మైలార్​దేవ్​ పల్లిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.

అగ్నిప్రమాదం
author img

By

Published : May 26, 2019, 12:48 PM IST

Updated : May 26, 2019, 1:17 PM IST

కాటేదాన్​ ప్లాస్టిక్​ పరిశ్రమలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మైలార్​దేవులపల్లి డివిజన్​లోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఓ ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. చుట్టుపక్కల గృహాలు ఉండడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్లాస్టిక్​ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం వల్ల యాజమాన్య ఆగడాలు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : కూకట్​పల్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Last Updated : May 26, 2019, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.