ETV Bharat / state

ఇక్కడా ఇసుకాసురులే.. అక్రమ రవాణాపై అధికారుల కన్నెర్ర

ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న ఇసుక మాఫియా పట్ల అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. నిన్న మొన్నటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన రెవెన్యూ, పోలీస్ అధికారులు... తాజాగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక బకాసురులను అదుపులోకి తీసుకుంటున్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు.

author img

By

Published : Aug 1, 2020, 9:09 PM IST

ఇక్కడా ఇసుకాసురులే.. అక్రమ రవాణాపై అధికారుల కన్నెర్ర
ఇక్కడా ఇసుకాసురులే.. అక్రమ రవాణాపై అధికారుల కన్నెర్ర

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గ పరిధిలో అడ్డూ, అదుపు లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారంపై రెవెన్యూ, పోలీసు అధికారులు దృష్టి సారించారు. ఇటీవలే కాలంలో ఇసుక మాఫియా నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. షాద్​నగర్​కు సమీపంలోనే రాజపూర్​లో ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఫలితంగా ఇసుక మాఫియా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి పెరిగింది. నియోజకవర్గం పరిధిలో ఫరూఖ్​నగర్, కొత్తూరు, కొందుర్గ్, కేశంపేట మండలాల్లో వాగులు ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా...

గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వాగుల్లోంచి ఇసుక లారీలు, ఇతర వాహనాల ద్వారా అక్రమంగా బయటకు తరలిపోతోంది. ఏటా ఈ విషయంపై ఫిర్యాదులు అందుతున్నప్పటికీ.. అధికారులు స్పందించలేదు. తాజాగా పెరుగుతున్న ఫిర్యాదులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాగుల్లో ఇసుక తరలింపు, ఇసుక నిల్వలపై చర్యల వంటి కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు.

విస్త్రృతంగా తనిఖీలు...

కేశంపేట మండలంలో ఇసుక బట్టిలను ధ్వంసం చేసినా అధికారులు... తాజాగా తరలింపును అడ్డుకునేందుకు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాద్​నగర్​లో అక్రమ ఇసుక నిల్వలను గుర్తించి ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించడం వల్ల తమకు మేలు జరుగతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : కరోనాతో వ్యక్తి మృతి.. రాత్రంతా ఇంటి ముందే ఉన్న మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.