ETV Bharat / state

'బాత్​రూంకి వెళ్లవలసి వస్తుందని నీళ్లు కూడా తాగలేదు'

author img

By

Published : Mar 4, 2023, 10:30 AM IST

Government Junior College in Saroor Nagar: రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకున్న కేసులో సరూర్​ నగర్​ డివిజన్​లోని ప్రభుత్వ జూనియర్​ కళాశాల సమస్య ఒకటి. దశాబ్దాలుగా ఉన్న ఈ కళాశాలలో సౌకర్యాల కంటే సమస్యలే అధికం. ఇప్పుడీ సమస్యలపైనే హైకోర్టు దృృష్టిసారించింది.

Government Junior College in Sarur Nagar Division
సరూర్​ నగర్​ డివిజన్​లోని ప్రభుత్వ జూనియర్​ కళాశాల

Government Junior College in Saroor Nagar: కాలేజ్​ అంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటూ ఇంటి తరవాత ఎక్కువగా సౌకర్యంగా ఉండే ప్రదేెశం. ప్రతి విద్యార్థి తన జీవితంలో సగం సమయం కళాశాలలోనే గడుపుతారు. దీనికి భిన్నంగా కొన్ని ప్రైవేట్ కళాశాలలు అధిక ఫీజులతో పాటు తమ కళాశాల గుర్తింపు కొరకు విద్యార్థులను వేధిస్తుంటే, ప్రభుత్వ కళాశాలలో వసతులు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కోవలో సరూర్​నగర్ డివిజన్​లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అందరికి ఒకటే బాత్​రూం: దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కళాశాలలో దాదాపు 700 మంది విద్యార్ధిని, విద్యార్థులకు ఒకటే టాయిలెట్ ఉందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్ధం అవుతుంది. బాత్​రూంకి వెళ్లవలసి వస్తుందని మంచినీళ్లు తాగాలన్నా విద్యార్థులు భయపడేవాళ్లమని తెలిపారు. కాలేజ్​ పరిశుభ్రతను అసలు పట్టించుకునేవారు కాదని అన్నారు. అంతేకాకుండా బాత్​రూం రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నామని ఆ కళాశాల విద్యార్థులు చెబుతున్నారు.

సమస్యపై కాలేజ్​లో ధర్నా: రెండు నెలల క్రితం విద్యార్థులు తమ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు. వారి ధర్నాకు ప్రతిపక్ష పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి. కేఏ పాల్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మూత్రశాలల కొరకు రూ.2కోట్లు మంజూరు అయ్యాయని పనులు మొదలుపెడతామని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు.

హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన మణిదీప్​: అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. కళాశాలలో జరుగుతున్న విషయాలను పత్రికల్లో చూసిన లా స్టూడెంట్ మణిదీప్ ఈ విషయాన్ని లేఖ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తెలంగాణ సీఎస్, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కమిషనర్​లకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఏప్రిల్ 25లోగా వసతులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం కళాశాల వద్ద సందడి నెలకొంది, పిటిషనర్ మణిదీప్​తో పాటు, కార్పొరేటర్ శ్రీవాణి, బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు కళాశాలను సందర్శించారు.

"ఈ కళాశాలలో 700 మంది విద్యార్థులకు ఒకటే బాత్రూం ఉన్నది. ఆ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్నాను. అనంతరం కళాశాలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను, వాస్తవాలు తెలుసుకొని చీఫ్ జస్టిస్​కు లేఖ రాశాను. నేను రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు విద్యాశాఖ ఉన్నత అధికారులకు నోటీసులు జారీ చేసింది. పాలకులు తమ పిల్లులు ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుతున్నారన్న ఆలోచనతో పనిచేయాలని కోరుతున్నాను."-మణిదీప్, లా పిటిషనర్

సరూర్​ నగర్​ ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.