ETV Bharat / state

బస్తీమేసవాల్​: బండ్లగూడ గోడు తీర్చేదెవరో...?

author img

By

Published : Jan 15, 2020, 1:33 PM IST

తలాపునే చరిత్రాత్మక హిమాయత్‌సాగర్ ఉన్నా మంచినీటి ఇబ్బందులు తప్పడంలేదు. ఐటీ కంపెనీ ఉద్యోగులున్నా... రియల్ ఎస్టేట్ వేగంగా విస్తరించినా... ఆ కార్పొరేషన్ అభివృద్ధి ఆమడదూరంలోనే ఆగిపోయింది.  పురపాలక సంఘమైన మూడు నెలల్లోనే నగరపాలక సంస్థగా మారిన బండ్లగూడజాగీర్‌పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

MUNICIPAL ELECTIONS IN BANDLAGUDA CORPORATION
బస్తీమేసవాల్​: బండ్లగూడ గోడు తీర్చేదెవరో...?
బస్తీమేసవాల్​: బండ్లగూడ గోడు తీర్చేదెవరో...?

నూతనంగా నగరపాలక సంస్థగా ఏర్పాటైన బండ్లగూడజాగీర్‌లో మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో పురపాలక సంఘంగా ఆవిర్భవించి..అతికొద్ది కాలంలోనే బండ్లగూడజాగీర్, హైదర్‌షా కోట్, పీరంచెరువు, కిస్మత్‌పూర్, హిమాయత్ సాగర్ గ్రామపంచాయతీలతో కార్పొరేషన్‌గా ఏర్పాటైంది. బండ్లగూడజాగీర్‌ కార్పొరేషన్‌లో 22 వార్డులు ఉన్నాయి. 59వేల88 మంది ఓటర్లు ఉన్నారు. 30వేల562 మంది పురుషులు... 28వేల526 మంది మహిళా ఓటర్లున్నారు.

తలాపునే హిమాయత్ సాగర్ ఉన్నా నీటి సమస్య

హైదరాబాద్ మహానగరానికి పొరుగునే ఉన్నా... గ్రామీణ వాతావరణమే ఇక్కడ ప్రతిబింబిస్తోంది. బండ్లగూడజాగీర్‌లో మిషన్ భగీరథ కింద 123 ప్రాంతాలకు నీరు ఇవ్వాల్సి ఉండగా.... నీరందనివి 63 కాలనీలు ఉన్నాయి. మిషన్ భగీరథ రెండోదశ పనులు పూర్తికాలేదు. చరిత్రాత్మక జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్ ఈ కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. అయినా ఈ ప్రాంత ప్రజలు మంచినీటి కోసం వ్యయప్రయాసలు పడుతూనే ఉన్నారు. హైదర్షాకోట్, కిస్మత్ పురా పూర్వ గ్రామపంచాయితీల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగానే ఉంది. వారానికి ఒకసారి మంచినీళ్లు వస్తుంటాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిస్మత్‌పుర కాలనీ, గంధంగూడ, హైదర్షాకోట్, సన్‌సిటి, TNT కాలనీ, పీరంచెరువు తదితర ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది.

సమస్యలతో బండ్లగూడ వాసుల సావాసం

బండ్లగూడజాగీర్ కార్పొరేషన్‌లో చాలా ప్రాంతాల్లో మురుగునీరు పొంగిపొర్లుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లు సరిగ్గాలేకపోవడంతో సరైన రవాణావ్యవస్థ లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిస్మత్‌పుర నుంచి బండ్లగూడ వైపునకు వెళ్లే ప్రధాన రోడ్డు, కిస్మత్‌పుర దర్గా ఖలిజ్‌ఖానా వరకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. వీధి దీపాలు లేక రాత్రిళ్లు అవస్థలు పడుతున్నామంటున్నారు. ఐటీ పరిశ్రమలు కార్పొరేషన్‌కు కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడ ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీ వ్యవస్థ అభివృద్ధి చెందింది. గతుకుల రోడ్లు ఎక్కువగా ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదర్షాకోట్, గంధంగూడ గ్రామాలు మూసీనదీ పరివాహకప్రాంతంలోనే ఉండగా.. దోమలబెడద ఎక్కువగా ఉంది. చీకటి పడిందంటే చాలు... దోమలదాడి ప్రారంభమవుతుందని జనం ఆవేదన చెందుతున్నారు.

తొలిసారిగా జరుగుతున్న నగరపాలక సంస్థ మేయర్ పీఠం అధిరోహించాలని అన్నిపార్టీల నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపా మధ్య త్రిముఖ పోటీ కన్పిస్తోంది.ఎలాగైనా మొదటి మేయర్ పీఠంపై కూర్చోవాలని అన్ని పార్టీలు పట్టుదలగా ఉన్నాయి.

ఇవీ చూడండి: మున్సిపల్​ ఎన్నికల ఏకగ్రీవంలో కారు జోరు..

Intro:Body:

BANDLAGUDA

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.