రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నేపాల్ నుంచి రాష్ట్రానికి వలస వచ్చిన కూలీలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 12 కిలోల బియ్యం రెండు కిలోల కందిపప్పు, ఒక లీటర్ వంట నూనెను ఎమ్మెల్యే అందజేశారు.
కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య