ETV Bharat / state

అండగా నిలవాల్సిందిపోయి ఆటంకాలా?.. కేంద్రం, భాజపా నేతలపై కేటీఆర్​ ధ్వజం - కేటీఆర్​ తాజా వ్యాఖ్యలు

KTR on Central Govt: ఏడున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని ఎన్డీయే ప్రభుత్వాన్ని, భాజపా నేతలను మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. తెలంగాణ పథకాలు దేశం మొత్తానికి దిక్సూచిగా మారాయని ఆయన అన్నారు. అభివృద్దిలో పరుగులు పెడుతున్న రాష్ట్రానికి అండగా నిలబడాల్సిన కేంద్రం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పైసా సహకారం లేదని అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో తెరాస ప్రభుత్వంతో భాజపా పోటీ పడాలని సూచించారు.

అండగా నిలవాల్సిందిపోయి ఆటంకాలా?.. కేంద్రం, భాజపా నేతలపై కేటీఆర్​ ధ్వజం

author img

By

Published : Jan 30, 2022, 4:12 AM IST

KTR on Central Govt: దేశంలో అధికారంలో ఉన్న భాజపా గత ఏడున్నర సంవత్సరాల కాలంగా తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భాజపా నాయకులను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అభివృద్ధిలో తెరాస ప్రభుత్వంతో పోటీపడండి.. అని భాజపా నేతలకు హితవు చేశారు. తాము 371 కోట్ల రూపాయల నిధులు ఇస్తే.. భాజపా వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకొచ్చి.. ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంతేకానీ మతం పేరుమీద విడగొట్టుడు, విచ్చిన్నం చేసే ప్రయత్నం చేయడం మంచిదికాదని భాజపా నేతలకు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరోజే 371 కోట్ల రూపాయల పథకాలకు శంకుస్థాపన చేశామని.. కేంద్ర ప్రభుత్వం నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి భాజపా తెచ్చిన నిధులు..వచ్చిన పైసలు ఎన్నో చెప్పే ధైర్యం ఒక్క భాజపా నాయకుడికి అయినా ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

దేశానికే దిక్సూచిగా మారాయి..

తెలంగాణ పథకాలు దేశం మొత్తానికి దిక్సూచిగా మారాయని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.371 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బడంగ్​పేట్ కార్పొరేషన్​లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు సుభిక్షంగా అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమం వల్ల ఈరోజు భారతదేశం మొత్తానికే తెలంగాణ ఆదర్శమైందన్నారు. రాష్ట్రంలోని మిషన్ భగీరథ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీకి నచ్చి హర్ ఘర్ కో జల్ అని కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నాని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కడుతున్న పన్నులు భారతదేశ అభివృద్దికి ఉపయోగపడుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

అడుగడుగునా ఆటంకాలే..

అభివృద్దిలో పరుగులు పెడుతున్న రాష్ట్రానికి అండగా నిలబడాల్సిన కేంద్రం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పైసా సహకారం లేదని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్​కు వరదలొస్తే.. అరపైసా సాయం చేయలేదన్న కేటీఆర్​... అదే గుజరాత్​లో వరదలు వస్తే హెలికాప్టర్ వేసుకుని వెళ్లి అక్కడ వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఒక్క నవోదయ పాఠశాల మంజూరుచేయలేదన్నారు. దేశం మొత్తంలో 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే... తెలంగాణకు గుండుసున్నా అని ధ్వజమెత్తారు. దేశం మొత్తం 16 ఐఐఎంలు మంజూరు చేస్తే.. రాష్ట్రానికి గుండుసున్నా అని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చింది గుండు సున్నా.. ఇక్కడ భాజపా నేతలు మాట్లాడే మాటలు బడాయి మాటలు అని ఎద్దేవా చేశారు. రాజకీయం అధికారం ప్రజలు పెట్టిన భిక్ష అని.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ది పనులు చేయాలన్నారు. అభివృద్ధిలో తెరాస ప్రభుత్వంతో భాజపా పోటీ పడాలని సూచించారు.

తెలంగాణకు ఏం చేశారు?

‘"రిజర్వు బ్యాంకు నివేదిక మేరకు భౌగోళికంగా 11వ స్థానంలో తెలంగాణ ఉంది. జనాభాపరంగా 12వ స్థానంలో ఉంది. దేశ ఆర్థికానికి ఊతమిచ్చే నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా నిలిచింది. యూపీ, బిహార్‌ వంటి వెనుకబడిన రాష్ట్రాలకు బువ్వ పెట్టే స్థాయిలో తెలంగాణ ఉంది. ఇలాంటి రాష్ట్రానికి అండగా నిలవాల్సిందిపోయి అడుగడుగునా ఆటంకాలు.. ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి పైసా సహకారం అందించడం లేదు. ఏడున్నరేళ్లలో తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని, భాజపా నాయకులను డిమాండ్‌ చేస్తున్నా" -కేటీఆర్​

అండగా నిలవాల్సిందిపోయి ఆటంకాలా?.. కేంద్రం, భాజపా నేతలపై కేటీఆర్​ ధ్వజం

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.