ETV Bharat / state

ఉత్తమ పోలీస్​గా మంచాల ఎస్సై.. డీజీపీ చేతుల మీదుగా రివార్డు

రంగారెడ్డి జిల్లా మంచాల పోలీసు స్టేషన్(Manchal police station) ఎస్సై సురేశ్​ (SI Suresh).. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీసు అధికారిగా ఎంపికయ్యారు. కేసుల విచారణ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకుగాను రివార్డు దక్కింది. డీజీపీ మహేందర్ రెడ్డి (dgp mahender reddy) చేతుల మీదుగా ఆయన ఈ రివార్డును అందుకున్నారు.

manchal si suresh gets commendation reward from dgp
ఉత్తమ పోలీస్​గా మంచాల ఎస్సై సురేశ్​, రాష్ట్రస్థాయిలో ఉత్తమ పోలీస్
author img

By

Published : Jun 30, 2021, 4:45 PM IST

కేసుల విచారణ విభాగంలో ఉత్తమ సేవలందించిన మంచాల (Manchal police station) ఎస్సై సురేశ్​ ((SI Suresh)​... రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఎస్సైగా ఎంపికయ్యారు. 2020-21 సంవత్సరానికి గాను ఉత్తమ సేవలందించిన ఎస్సైలు, పోలీసు సిబ్బందిని 17 విభాగాలుగా విభజించి పలువురిని రివార్డులకు ఎంపిక చేశారు. కేసుల విచారణ విభాగంలో సురేశ్​కు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి (dgp mahender reddy) చేతుల మీదుగా రివార్డును అందుకున్నారు.

రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధికారిగా ఎంపికవ్వటంపై ఎస్సై సురేశ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. విధి నిర్వహణలో సహకరించిన అధికారులకు, స్టేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు అందుకున్న ఎస్సై సురేశ్​​కు... సీఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బందితో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: Jagan on ts ministers : 'తెలంగాణ మంత్రులు ఎక్కువ మాట్లాడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.