Kharmanghat Hanuman Temple: హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రద్దీతో ఆలయాలు సందడిగా మారాయి. నగరంలో పెద్దఎత్తున భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రసిద్ధ కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో తమలపాకులతో పూజలు చేసి వర్ణమాలతో అలంకరించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్‌కి చెందిన పద్మశాలీలు ఉపవాస దీక్షతో ఉండి ఆలయ ప్రాంగణంలోనే వస్త్రాన్ని నేసి స్వామివారికి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస శర్మ తెలిపారు.
ఇవీ చూడండి: MP Komatireddy: 'చెరువులను కబ్జా చేసిన మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి'