ETV Bharat / state

'గచ్చిబౌలి టిమ్స్​లో వెంటనే కొవిడ్​ సేవలు ప్రారంభించాలి'

author img

By

Published : Jul 8, 2020, 12:58 PM IST

రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో తక్షణమే కొవిడ్ చికిత్స ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్ చేశారు. కార్పొరేట్​ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కొవిడ్​ చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

cpi protest to start services at gachibowli tims
'గచ్చిబౌలి టిమ్స్​లో వెంటనే కొవిడ్​ సేవలు ప్రారంభించాలి'

రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి టిమ్స్​ ఆసుపత్రిలో తక్షణమే కొవిడ్​ సేవలు ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం గచ్చిబౌలి ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టేందుకు వెళ్లిన సీపీఐ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్​ చేయడం దారుణమన్నారు. పోలీసులు అక్కడ అనుమతులివ్వనందున హిమాయత్​నగర్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ నిరసన తెలిపారు.

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున.. కరోనా వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ చేర్చాలని.. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని చాడ వెంకట్​రెడ్డి కోరారు. కార్పొరేట్​ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కొవిడ్​ చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా వైరస్ విషయంలో తగు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున చర్యలు చేపడతామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.