ETV Bharat / state

ఆరుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అరెస్ట్​ - తెలంగాణ కాంగ్రెస్​ వార్తలు

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోకాపేట సబితానగర్‌ వద్ద ఆరుగురు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

congress mla's arrest
ఆరుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అరెస్ట్​
author img

By

Published : Mar 7, 2020, 5:06 PM IST

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జన్వాడలో 111 జీవోకు వ్యతిరేకంగా ఉన్న నిర్మాణాల పరిశీలించేందుకు ఆరుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు వెళ్లారు. కోకాపేట సబితానగర్‌ వద్ద ఆరుగురు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో భట్టి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పోడెం వీరయ్య, రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.

మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కూడా రాజీనామా చేయాలన్నారు. తెరాస నేతలు 2 వేల ఎకరాల భూమి ఆక్రమించుకున్నారని భట్టి ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఆక్రమించిన విషయం ప్రజలకు తెలియాడానికే తాము వెళ్తున్నామని తెలిపారు. అక్రమ అరెస్ట్​ను భట్టి ఖండించారు.

ఆరుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అరెస్ట్​

ఇవీ చూడండి: నేను కేసీఆర్‌ బొమ్మతో గెలవలేదు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.