ETV Bharat / state

రణరంగంగా మారిన ఇబ్రహీంపట్నం-కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ - కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ ఫైట్

Clash Between BRS and Congress Leaders in Ibrahimpatnam : నామినేషన్ల వేళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రణరంగంగా మారింది. ఒకే రోజు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు ఉండగా.. పోటాపోటీ నినాదాలు చేసుకుని, రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలతో పాటు.. పోలీసులకు గాయాలయ్యాయి. లాఠీలకు పనిజెప్పిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని రాచకొండ సీపీ పర్యవేక్షించగా.. శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు.

Clash Between BRS and Congress
Clash Between BRS and Congress Leaders in Ibrahimpatnam
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 10:15 PM IST

రణరంగంగా మారిన ఇబ్రహీంపట్నం-కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

Clash Between BRS and Congress Leaders in Ibrahimpatnam : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నువ్వా-నేనా అనే రీతిలో తలపడుతున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌(BRS Vs Congress) అభ్యర్థులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి ఒకే రోజు నామినేషన్‌(Telangana Election Namination) కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలే హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో.. తాజాగా ఇద్దరూ ఒకే రోజు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఉదయం సమయం కేటాయించగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మధ్యాహ్నం 2గంటలకు సమయం కేటాయించారు.

నేతల నామినేషన్‌ కోసం నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి ఉదయమే ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్‌ వేసి.. కార్యకర్తలతో కలిసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఇదే సమయంలో నామినేషన్‌ వేసేందుకు పట్టణంలో నుంచి మల్‌రెడ్డి ర్యాలీ ప్రారంభించగా.. బస్‌ డిపో వద్ద ఇరువర్గాలు తారసపడ్డాయి.

Manchireddy Kishanreddy Vs Malreddy Rangareddy : రెండు వైపుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు.. పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి ప్రారంభం కాగా.. పెద్దఎత్తున దాడులు(BRS and Congress Clash War) చేసుకున్నారు. ఈ గొడవలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు, మధ్యలో ఉన్న పోలీసులకు గాయాలయ్యాయి. అక్కడున్న కొన్ని వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో లాఠీలకు పనిజెప్పిన పోలీసులు.. 2 వర్గాలను చెదరగొట్టారు.

Political Heat in Rangareddy District : రసవత్త'రంగా'రెడ్డి రాజకీయం.. ఓటర్లను ఆకర్షించేందుకు నేతల పాట్లు

పరిస్థితి సమీక్షించిన సీపీ చౌహాన్ : ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతల విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ వెంటనే అక్కడి వెళ్లారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన పరిస్థితి చేయిదాటకుండా పర్యవేక్షించారు. నామినేషన్‌ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే ఈ ఘర్షణ జరిగిందని సీపీ చౌహాన్‌ తెలిపారు.

Malreddy Rangareddy Fires on BRS : ఓ వైపు గొడవ జరుగుతుండగా అందులో చిక్కుకున్న మల్‌రెడ్డి రంగారెడ్డి.. ద్విచక్రవాహనంపై వెళ్లి నామినేషన్‌ వేశారు. అనంతరం, గాయపడిన కాంగ్రెస్‌ కార్యకర్తలను పరామర్శించిన ఆయన.. అధికార పార్టీ దౌర్జనం చేస్తోందని ఆరోపించారు. ఘటనకు కారణమైన వెంటనే చర్యలు తీసుకోకపోతే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.

"సరైన సమయానికి ఆర్డీఓ ఆఫీసుకు చేరాలని మేము వస్తా ఉంటే.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు ముందుకు రాగానే రాళ్లు విసరడం చేశారు. ఇది అంతా ఒక పథకం ప్రకారం చేస్తూ ఉన్నారంటే పోలీసులు ఏం చేస్తున్నారు. దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకోవాలని.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులు దీనిపై చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం." - మల్‌రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ అభ్యర్థి

Telangana Assembly Election 2023 : మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ నామపత్రాలు దాఖలు చేసే వేళ స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. సుమన్ వాహనాన్ని కార్యాలయంలోకి అనుమతించి, వివేక్‌ వాహనాన్ని అనుమతించకపోవటంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు హనుమకొండ జిల్లా పరకాల నామినేషన్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి నామినేషన్ వేసేందుకు రాగా.. రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.

పోలింగ్‌ ఎప్పుడొచ్చినా పోరు పతాక స్థాయిలోనే - రంగారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావ'రణం' ఎలా ఉందంటే?

ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు.. వారికే గ్యారెంటీ లేదు : మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.