రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో పారిశుద్ధ్య కార్మికులకు భాజపా నాయకులు కల్లెం రవీందర్ రెడ్డి అల్పాహారం అందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యం పరిసరాల పరిశుభ్రత చేసే పారిశుద్ధ్య కార్మికులు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వైరస్ నుంచి విముక్తి కల్పించడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని కొనియాడారు.
సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు... ఐదు రోజుల నుంచి అల్పాహారం తయారు చేయించి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అప్పటివరకు అల్పాహారం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే నియమాలను పాటించి, కరోనా కట్టడికై స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: రికార్డు స్థాయిలో కేసులు... ఉలిక్కిపడ్డ భాగ్యనగరం