ETV Bharat / state

చేవెళ్లలోని పలువురు భాజపా నేతల హౌస్​అరెస్ట్​.. - చేవెళ్లో భాజపా నేతలు హౌస్​ అరెస్ట్​

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్​పల్లి, మొయినాబాద్ మండలాల్లోని భాజపా నాయకులను పోలీసులు హౌస్​ అరెస్ట్ చేశారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమం​ ముందుస్తు చర్యల్లో భాగంగా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.

bjp leaders house arrest at chevella in rangareddy district
చేవెళ్లలోని పలువురు భాజపా నేతలు హౌస్​అరెస్ట్​
author img

By

Published : Nov 2, 2020, 2:50 PM IST

అక్రమ అరెస్టులను నిరసిస్తూ భాజపా నాయకులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆందోళనలకు దిగారు. కేసీఆర్ డౌన్​డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

భాజపా 'ఛలో హైదరాబాద్​' పిలుపు మేరకు పోలీసులు ముందస్తుగా చేవెళ్ల, శంకర్​పల్లి, మొయినాబాద్ మండలాల్లోని ఆయా పార్టీ నేతలను హౌస్​ అరెస్ట్ చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, శ్రీరాములు తదితరుల నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: 'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.