హనుమాన్ జయంతి సందర్భంగా జై శ్రీరామ్, ఓం నమశివాయ అంటూ హనుమాన్ భక్తుల నామస్మరణతో వేములవాడ రాజన్న ఆలయం మారుమోగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో రద్దీ నెలకొంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి ముందు ఆంజనేయ స్వామి భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.
భక్తులు తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. హనుమాన్ భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి కొండగట్టు ఆంజనేయ స్వామివారి దర్శనానికి బయలుదేరారు.
ఇవీ చూడండి: మాంగళ్య ధారణ సుముహూర్తోస్తూ...