ETV Bharat / state

కలెక్టర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం: పొన్నం - రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తలు

ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు కలెక్టర్ కృష్ణ భాస్కర్​కు వినతి పత్రం సమర్పించడానికి వెళ్తే... ఆయన వ్యవహరించిన తీరు తెరాసకి అనుకూలంగా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఎస్​కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

tpcc working president ponnam prabhakar fire on rajanna sircilla district collector
కలెక్టర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం: పొన్నం
author img

By

Published : Nov 13, 2020, 12:40 PM IST

కాంగ్రెస్ నేతల పట్ల రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సన్నరకం ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించాలని... అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ కలెక్టర్​కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే ఆయన వ్యవహరించిన తీరు తెరాసకి అనుకూలంగా ఉందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

జిల్లాలో కలెక్టర్ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకుల పట్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ వ్యవహరించిన తీరుపై సోమేశ్ కుమార్​కు ఫిర్యాదు చేస్తామన్నారు. సిరిసిల్లలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి: జవం.. జీవం.. సూర్యం- ఆరోగ్యం మీ వశం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.