రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. రైతు మృతి చెందిన సందర్భంలో అతని కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ సర్కార్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో అకాల మరణం చెందిన ఏడుగురు రైతు కుటుంబాలకు బీమా సాయాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. తడగొండకు చెందిన గుంటి మల్లయ్య, బొంగాని అంజయ్య (మల్కాపూర్), మంద తిరుపతి (దుండ్రపెల్లి), దావా లచ్చిరెడ్డి, పొత్తూరి పోచయ్య (బోయినపల్లి), బొంగాని లచ్చవ్వ, ఎన్నం రమ్య (స్థంభంపల్లి)ల ఇళ్లకు స్వయంగా వెళ్లి రూ.5 లక్షల చొప్పున రైతు బీమా ప్రొసీడింగ్స్ ఇచ్చారు.