ETV Bharat / state

జగిత్యాల స్ఫూర్తితో ‘జలహితం'.. సిరిసిల్లలో ప్రారంభించనున్న కేటీఆర్‌

author img

By

Published : Jun 19, 2020, 6:52 AM IST

జగిత్యాల జిల్లాలో వినూత్నంగా అమలు చేసిన జలహితం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఉపాధి హామీ పథకం కింద కాల్వల్లో పూడిక తీయనున్నారు. సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.

ktr
ktr

జగిత్యాల జిల్లా స్ఫూర్తితో ఉపాధి హామీ కింద కాల్వల్లో పూడికతీసే కార్యక్రమానికి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాల్వల్లో పూడిక పేరుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఉండగా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి వినూత్నంగా ఆలోచించి జలహితం పేరుతో ఉపాధి హామీ ద్వారా కాల్వల్లో పూడికతీత పనులకు గత నెలలో శ్రీకారం చుట్టారు. జిల్లాలో 320 పంచాయతీలు శ్రీరాంసాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉన్నాయి.

ఎస్సారెస్పీ కింద 1057 నీటి పారుదలశాఖ కింద 58 కాల్వలుండగా కేవలం 20 రోజుల్లో 500 కిలోమీటర్ల మేర పూడిక తొలగించారు. ప్రతిరోజు 15 వేల మంది కూలీలు పాల్గొనగా రూ.4.93 కోట్లు కూలీలకు వేతన రూపంలో ఖర్చయింది. జిల్లాలో 1.74 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాల్వలు పూడిక తొలగి రూపురేఖలు మారిపోయాయి. జిల్లాలో జరుగుతున్న పనులను మంత్రి ఈశ్వర్‌ ద్వారా తెలుసుకున్న సీఎం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ ద్వారా ఈనెల 19న కాల్వల్లో పూడికతీత పనులను ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో మానేరు కాల్వలో పూడికతీత పనులను ఇవాళ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

ఇదీ చదవండి: మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.