రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల సర్పంచి వజ్రవ్వ కుమారుడు పరమేశ్వర్‌కు, మద్దికుంటకు చెందిన వర్షతో వివాహం జరిగింది. మంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించి మొక్కలను బహుమతిగా అందించారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని హరీశ్‌రావు సందర్శించారు. మండల ప్రజా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ముస్తాబాద్ మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. గోదావరి జలాలు వస్తే బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!