ETV Bharat / state

మధ్యమానేరు ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన - mid manure expats protest at project work place

మధ్యమానేరు ప్రాజెక్టు వద్ద నిర్వాసితులు ఆందోళన చేశారు. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయినా ఇప్పటికీ సర్కారు పరిహారం చెల్లించలేదని వాపోయారు.

మధ్యమానేరు ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన
author img

By

Published : Oct 15, 2019, 9:56 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ప్రాజెక్టు మరమ్మతు పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. బోయినపల్లి మండలం మానువాడ గ్రామానికి చెందిన నిర్వాసితులు కుటుంబ సభ్యులతో సహా ప్రాజెక్ట్​ నిర్మాణ ప్రాంతం ఎదుట బైఠాయించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోయినా.. ఇప్పటికీ తమకు పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని నిర్వాసితులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఉద్రిక్తతల కారణంగా మధ్యమానేరు మరమ్మతు పనులు నిలిచిపోయాయి.

మధ్యమానేరు ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన

ఇవీచూడండి: బలిదానాలు లేని తెలంగాణ కావాలనుకున్నాం: నాగం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.