ETV Bharat / state

TS Floods: సాధారణం కన్నా అధిక వర్షపాతం.. ముంపులోనే పలు ప్రాంతాలు

గత అయిదు రోజులుగా రాష్ట్రంలో కురిసిన కుండపోత వానలతో వర్షపాతం లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. జూన్‌ ఒకటి నుంచి బుధవారం వరకూ ప్రస్తుత వానాకాలంలో రాష్ట్ర సాధారణ వర్షపాతం 636 మిల్లీమీటర్ల(మి.మీ.) కన్నా 40 శాతం అదనంగా కురిసినట్లు వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

TS Floods
ముంపులోనే పలు ప్రాంతాలు
author img

By

Published : Sep 9, 2021, 8:24 AM IST

రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలు, మండలాలవారీగా చూస్తే కొన్నిచోట్ల 100 నుంచి 140 శాతం అదనంగా కురవడంతో వాగులు, చెరువులు పొంగిపొర్లి రోడ్లు, కాలనీలు నీటమునిగాయి. పలుచోట్ల అధిక జనాభా, వర్షపు నీరు వెళ్లేందుకు సరిపోయినంతగా డ్రైనేజీలను అభివృద్ధి చేయకపోవడం వల్ల కూడా కాలనీలు నీటమునిగాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం 508.8 మి.మీ.లకు గాను 128 శాతం అదనంగా 1161.6 మి.మీ. వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాధారణంకన్నా 106 శాతం అధికంగా నమోదైంది. ఇందులో గత 5 రోజులుగా కురిసిందే చాలా ఎక్కువగా ఉంది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో సాధారణ వర్షపాతం కన్నా 174 శాతం అదనంగా నమోదైంది. సిరిసిల్ల దగ్గరగా ఉన్న 3 చెరువుల్లో 1989 తర్వాత తిరిగి ఈ సీజన్‌లోనే వరద వచ్చి అలుగు పారడంతో పట్టణంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో సాధారణంకన్నా 190 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
  • రాష్ట్రమంతా వర్షాలు ఒకేతీరుగా పడలేదు. ఉత్తర తెలంగాణలోనే కుంభవృష్టి అధికంగా ఉంది. దక్షిణ తెలంగాణలో వానలు తక్కువగా ఉన్నాయి. వనపర్తి జిల్లాలో సాధారణం కంటే 8 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో వర్షపాతం వివరాలు

బాల్యానికే చెల్లింది..
TS Floods
చేపలు పడుతున్న చిన్నారులు

వానొచ్చినా, వరదొచ్చినా.. మెరుపు మెరిసినా, హరివిల్లు విరిసినా.. పూవు పూసినా, కాయ కాసినా.. ఇట్టే స్పందించటం, సంతోషంతో కేరింతలు కొట్టటం కేవలం బాల్యానికే చెల్లింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శనగర్‌లో ఓ చెరువుంది. భారీవర్షాలకు అది పూర్తిగా నిండింది. అందులోంచి వరద నీరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణ గుండా పారుతోంది. ఆ నీటిలో చేపపిల్లలు కొట్టుకురావడంతో బడిలోని పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో వాటిని పడుతూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు.

లోతట్టు ప్రాంతాలు నీటిలోనే..

ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరంగల్‌ నగరంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హంటర్‌రోడ్డు ప్రాంతంలోని సాయినగర్, ఎన్టీఆర్‌నగర్, బృందావన్‌ కాలనీ, సంతోషిమాత కాలనీ, గాయత్రీనగర్, పోతన నగర్, భద్రకాళి రోడ్‌ జ్ఞాన సరస్వతి కాలనీల్లో బుధవారం సాయంత్రం వరకు వరదనీరు తగ్గలేదు. ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీటి ముంపులోనే ఉన్నాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం సమీపంలోని రేగుమాకుగండి వద్ద గోదావరి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.

2,500 ఎకరాలు నీటి పాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల బ్యాక్‌ వాటర్‌తో పంటలు ముంపునకు గురయ్యాయి. అన్నారం బ్యారేజీ వెనుక జలాలతో కాటారం మండలంలో 700 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌తో మహదేవ్‌పూర్‌ మండలంలో 1,400 ఎకరాలు, పలిమెల మండలంలో 400 ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంటలు నీట మునిగాయి.

  • * మల్హర్‌ మండలంలో మానేరు వాగు పరీవాహకంలో 2 వేల ఎకరాల వరకు నీటమునిగింది.
  • సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం వరదలో కొట్టుకుపోయిన పెరుమాండ్ల దేవయ్య(55) మృతదేహాన్ని బుధవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం కనుగొంది.

నిలిచిన ‘మహా’ రాకపోకలు

.

నిజామాబాద్‌ జిల్లాలో గోదావరి, మంజీరా, హరిద్రా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ మూడు నదులు రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద కలుస్తాయి. దీంతో కందకుర్తి అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి వరద పారుతోంది. మరోపక్క బోధన్‌ మండలం సాలూర వద్ద మంజీరలో ప్రవాహం పెరగడంతో లోలెవల్‌ రాతి వంతెన, సమీపంలోని హనుమాన్‌ ఆలయం పూర్తిగా నీట మునిగాయి. వరద ఉద్ధృతి కారణంగా తెలంగాణ - మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

11న మళ్లీ అల్పపీడనం

బంగాళాఖాతంలో ఈ నెల 11న మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న బుధవారం తెలిపారు. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లే సమయంలో కుంభవృష్టి కురిసింది.

ఇదీ చూడండి:CROP DAMAGE: పంట నష్టం లెక్కింపు, పరిహారం గురించి ప్రస్తావనేదీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.