రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు జలాశయం జలకళను సంతరించుకుంది. నెల రోజులుగా మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగు ద్వారా ఎగువ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. సోమవారం నాటికి జలాశయం పూర్తి సామర్థ్యం 2.5 టీఎంసీలకు చేరుకుంది. జలాశయంలో నీటిని చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'పబ్లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాదా'