రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో నిర్వహించిన హరితహారం సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రసంగించారు. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ తీగల కింద మొక్కలు నాటితే భవిష్యత్తులో సమస్యలు ఏర్పడతాయన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. వృక్ష సంపద ఉంటేనే వర్షాలు బాగా కురిసి.. సమస్త జీవజాలం మనుగడ సాగిస్తాయని అన్నారు. జిల్లాలో బోయిన్పల్లి మండలం మొక్కల పెంపకంలో మొదటి స్థానంలో నిలవాలని కోరారు.