ETV Bharat / state

గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం: మధు

పెద్దపల్లి జిల్లా మంథని మండల ప్రజాపరిషత్​ కార్యాలయంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ పుట్టమధు పాల్గొన్నారు. ఎంపీపీ కొండ శంకర్​తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సర్వసభ్యసమావేశంలో పాల్గొన్ని గ్రామాభివృద్ధిపై సమీక్షించారు.

zp chairmen putta madhu participated in haritha haaram program

author img

By

Published : Jul 4, 2020, 6:35 PM IST

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొండ శంకర్​తో కలిసి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు మొక్కలు నాటారు. అనంతరం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిపై సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పుట్ట మధు తెలిపారు. సర్పంచులు గ్రామాభివృద్ధికి ప్రతినిత్యం పాటుపడాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలను పర్యవేక్షించాలని... పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని పుట్ట మధు సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.