ETV Bharat / state

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం : డీసీపీ రవీందర్​

పల్లెల్లో ప్రశాంత వాతావరణం కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ రవీందర్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట పంచాయతీ పరిధిలోని శుక్రవారంపేట గ్రామంలో పోలీసు సిబ్బందితో కలిసి కార్డన్​ సెర్చ్ నిర్వహించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

cardon search i mutharam mandal in   peddapalli dist
కార్డన్ సర్చ్
author img

By

Published : Jan 4, 2021, 10:11 PM IST

గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతామని డీసీపీ రవీందర్​ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక పనులు చేసేవారికి సహకరించవద్దని ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట పంచాయతీ పరిధిలోని శుక్రవారంపేట గ్రామంలో ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ ఆకునూరి మహేందర్​తో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఒకప్పుడు మావోయిస్టులకు అనువుగా ఉంటూ... అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రామానికి ఒకేసారి భారీ ఎత్తున పోలీసు బలగాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం కోసమే కార్డన్​ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. పోలీసు సిబ్బంది ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. గ్రామస్థులెవరూ ఆందోళన చెందవద్దని పోలీసులు సూచించారు. గ్రామాల్లో యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉపాధి వైపు దృష్టి సారించాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం పోలీస్​శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని వెల్లడించారు. గ్రామాల్లోకి కొత్తవారు వచ్చినా... అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంథని, రామగిరి ఎస్సైలు ఓంకార్​ యాదవ్​, మహేందర్ యాదవ్​, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. పసివాడికి పోషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.