ETV Bharat / state

police treatment: వింటారా..? ఐసోలేషన్‌లో ఉంటారా..?

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు పదేపదే చెబుతున్నారు. అయినా కొందరు రోడ్లపైకి ఇష్టారాజ్యంగా వస్తున్నారు. ఏదో ఓ సాకుచెబుతూ తప్పించుకుంటున్నారు. కొందరికి చలానాలు విధించినా.. వాహనాలను జప్తు చేస్తున్నా.. తీరు మారడం లేదు. ఇలాంటి వారికి భయం కల్పించేలా పోలీసులు (police treatment) వినూత్నమైన శిక్షలు విధిస్తున్నారు.

punishment for lockdown violators
ఆకతాయిలకు పోలీసుల వినూత్న శిక్షలు
author img

By

Published : May 27, 2021, 7:47 PM IST

Updated : May 27, 2021, 7:58 PM IST

police treatment: వింటారా..? ఐసోలేషన్‌లో ఉంటారా..?

పెద్దపల్లిలో ప్రాంక్‌ వీడియోను (prank video) తలపించే సీన్‌ ఇది. కరోనా ఫస్ట్‌వేవ్‌ లాక్‌డౌన్‌ (lockdown) సమయంలో ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో (social media) హల్​చల్​ చేశాయి. కొందరు ప్రాంక్‌ వీడియోలు రూపొందించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. పెద్దపల్లిలో మాత్రం పోలీసులు దీన్ని నిజం చేశారు.

క్షమించమని వేడుకున్నా..

లాక్‌డౌన్‌ ఉల్లంఘించొద్దని పదేపదే చెబుతున్నా పెడచెవిన పెడుతున్న (lockdown rules violators) యువకులకు గుణపాఠం చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాళ్లను గుర్తించి ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. పోలీసులు లాక్కెళ్తుండగా యువకులు క్షమించమని వేడుకున్నారు. పోలీసులు మాత్రం వదలకుండా వాహనంలో తరలించారు.

మంచిర్యాలలోనూ..

మంచిర్యాల పోలీసులూ ఇదే తరహా శిక్షలు విధించాలని నిర్ణయించారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న ఆకతాయిలను (lockdown rules violators) గుర్తించి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి (covid isolation centers) తరలిస్తామని తెలిపారు. కొందరు యువకులను వ్యాన్ ఎక్కించిన పోలీసులు.. బెల్లంపల్లిలోని జిల్లా కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలిస్తామని తెలిపారు.

భయం కలగాలనే ..

మార్పు రావాలి, భయం కలగాలనే ఉద్దేశంతోనే రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఇలాంటి శిక్షలకు శ్రీకారం చుట్టారని మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ వెల్లడించారు.

బెల్లంపల్లిలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 30 మందిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడిచిపెట్టాలని మరోసారి రోడ్లపైకి రామని యువకులు వేడుకున్నారు. బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలేశారు.

బతుకు జీవుడా అంటూ..

పోలీసులు హెచ్చరించి వదిలేయడంతో బతుకు జీవుడా అంటూ యువకులు పరుగులు పెట్టారు. లాక్‌డౌన్‌ వేళల్లో (lockdown) మరోసారి పోలీసుల కంట పడబోమని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు.

ఇవీచూడండి: టీకా వద్దంటూ పొదల్లో దాక్కున్న వృద్ధురాలు

Last Updated : May 27, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.