భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తెలిపారు. జిల్లాలోని ముత్తారం మండలం మైదంబండ, పారుపల్లి, ముత్తారం గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం ఇంటికి ఆరు మొక్కలు నాటి... వాటిని సంరక్షించాలని చెబుతూ మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో 80 శాతం మొక్కలు పెంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపడితే... ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని జడ్పీఛైర్మన్ పుట్ట మధు కొనియాడారు.